హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్నారం మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడి ఎన్నిక

MNCL: జన్నారం మండల భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా రాజారావు ఎన్నికయ్యారు. బీజేపీ నర్మల్ జిల్లా కార్యాలయం నుంచి ప్రకటించిన ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల రాజారావు సంతోషం వ్యక్తం చేశారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.