హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాబ్ పేరుతో హోటల్‌లో బెదిరింపు

HYD: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌కు పిలిచిన కార్తీక్ (32) అనే వ్యక్తి 27 ఏళ్ల యువతిని కత్తితో బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడని ఫిర్యాదు అందింది. ఈ నెల 23న జరిగిన ఘటనపై బాధితురాలు 24న ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్ సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలిస్తున్నారు.