ASF: కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ వసాకే పుల్లబాయి గురువారం ప్రభుత్వం అందిస్తున్న యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యాభివృద్ధి సాధ్యమన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ


