హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ లో రూ.40 తగ్గిన పత్తి ధర

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. గురువారం సీసీఐ క్వింటాల్‌ పత్తికి రూ.8,667, ప్రైవేట్ ధర రూ.9,060 పలికింది. బుధవారంతో పోలిస్తే సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని మార్కెట్‌ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర మాత్రం క్వింటాల్‌కు రూ.40 తగ్గినట్లు వెల్లడించారు.