హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు మరియు పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MEO నాగారం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.