హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ముందస్తు అరెస్టులతో ప్రజా గొంతుకలను అణిచివేత'

NGKL: సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేటలో పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ నరమోని నరేష్ యాదవ్‌ను గురువారం ముందస్తు అరెస్టు చేసి అచ్చంపేట స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ముందస్తు అరెస్టులతో ప్రజా గొంతుకలను అణిచి వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.