హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం'

KMR: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగానికి పునాదులని పేర్కొంటూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలని కోరారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, వాటి స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నారు.