హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి: కంచర్ల

NLG: ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.