హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ బోరు బండ్లు సీజ్ చేసిన అధికారులు

SRD: కల్హేర్ మండలం మార్డి గ్రామ శివారులో అనుమతి లేకుండా బోర్లు తవ్వుతున్న వాహనాలను అధికారులు సీజ్ చేశారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో తహశీల్దార్ శివ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించి బోరు బండ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.