హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'

SDPT: ధూళిమిట్ట మండలంలో ఎల్-నినో ప్రభావం దృష్ట్యా పశుగ్రాస కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు MAO ఎండీ అఫ్రోజ్ తెలిపారు. గడ్డి జొన్న, పారా, నేపియర్ తదితర పశుగ్రాస పంటలు సాగు చేస్తున్న రైతులు తమ వివరాలను సంబంధిత AEOలకు అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.