BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద జాతీయ రహదారి 65పై ఈరోజు ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమీపంలో ట్రక్కు బ్రేక్డౌన్ కావడంతో ధర్మోజిగూడెం నుంచి కైతాపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను కోయ్యలగూడెం సర్వీస్ రోడ్డుపైకి మళ్లించడంతో అక్కడా రద్దీ నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
ట్రక్కు బ్రేక్డౌన్.. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్


