హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంపేటలో.. కురిసిన వర్షం తడిసిన ధాన్యం

MDK: నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రారంభం నుంచే నిర్వాహకులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కష్టం నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.