హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలం పనులు చేస్తుండగా వ్యక్తికి పాము కాటు

MBNR: బాలానగర్ మండలంలోని మామిడిగుట్ట తండాలో బుధవారం సాయంత్రం వ్యక్తికి పాము కాటు వేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. చాచు నాయక్ పొలంలో పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పాము కాటు వేసింది. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.