హైదరాబాద్: 28°C
తెలంగాణ

సగం మేరకు చేరిన పోచారం ప్రాజెక్టు నీటిమట్టం

KMR: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటల వరకు 0.908 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సగం మేర నీరు ఉంది. రోజుకు 28 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. డెడ్ స్టోరేజీ 0.175 టీఎంసీలుగా ఉందని తెలిపారు.