హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ పరిరక్షణ వేదిక సోషల్ మీడియా ఇన్‌చార్జి నియామకం

KNR: చిగురుమామిడి మండల రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రేకొండ గ్రామానికి చెందిన గడ్డం అనిల్ నియమితులయ్యారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు అందె స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగ పరిరక్షణపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా ద్వారా చైతన్యం తీసుకొస్తానని అనిల్ తెలిపారు.