హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టు రెండో దశపై సీఎం ప్రకటన కోసం ఎదురుచూపు

NGKL: అమ్రాబాద్, పదర మండలాల్లోని 14,400 ఎకరాలకు సాగునీరు అందించే ఉమామహేశ్వర ప్రాజెక్టు రెండో దశపై నేడు ఆ ప్రాంతంలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.750 కోట్లతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మన్ననూర్ వద్ద చెన్నకేశవ రిజర్వాయర్ నిర్మించి నల్లమల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని స్థానికులు కోరుతున్నారు.