హైదరాబాద్: 28°C
తెలంగాణ

పందుల స్వైరవిహారం

JN: జనగాంలో పందుల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధులు, కాలనీలలో పందులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి పందులకు అడ్డుకట్ట వేయాలన్నారు.