హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచే ఉచిత చీరల పంపిణీ!

ఖమ్మం: ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఖమ్మం జిల్లా మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం నుంచి ఉచిత చీరల పంపిణీ షురూ కానుంది. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తొలిరోజు వెయ్యి మందికి, మొత్తం 1,19,920 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీకి ఇంకా అనుమతి రాలేదని అధికారులు తెలిపారు.