హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్లూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా

KMM: కల్లూరు మున్సిపాలిటీలో ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.అనంతరం చైర్మన్ మోహన్ నాయక్‌కు వినతిపత్రం అందించారు. వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని జిల్లా కార్యదర్శి వేము రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కిట్లు, సబ్బులు, గ్లౌజులు అందించాలన్నారు.