హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ టాయిలెట్లలో విషసర్పాలు.. ప్రాణాలకు ముప్పు

WGL: కాకతీయ యూనివర్సిటీలోని అంబేద్కర్ వసతి గృహం టాయిలెట్లలో పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మలమూత్ర విసర్జనకు వెళ్లే సమయంలో పాములు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత పాముల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, అధికారులు వెంటనే స్పందించి పాములను తొలగించడంతో పాటు భద్రతా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.