SRCL: ఇందిరమ్మ చీరల ఉత్పత్తి ఈ నెలాఖరుతో ముగియనుండగా, కొత్త ఆర్డర్లు ఎప్పుడిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో సిరిసిల్ల నేతన్నల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 30 వేలకు పైగా మరమగ్గాలున్నాయి. రూ.334 కోట్లతో 6.33 కోట్ల మీటర్ల వస్త్రం ఆర్డరివ్వగా 6 కోట్ల మీటర్లకు పైగా పూర్తయింది. 95 లక్షల చీరలు తయారయ్యాయి. ఏటా 8 నెలల పని కల్పిస్తామన్న హామీ నిలవాలని కార్మికులు కోరుతున్నారు.
తెలంగాణ
సిరిసిల్ల నేతన్నల భవితపై సందిగ్ధం


