హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్యం వికటించి బాలిక మృతి

SRPT: మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన ప్రమీల (13) వైద్యం వికటించి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. జ్వరం రావడంతో ఇంటికి వచ్చిన ఆమెకు బుధవారం పెదవీడులోని ఓ ఆర్ఎంపీ ఇంజెక్షన్ ఇవ్వగా అపస్మారక స్థితికి చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.