MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ 13, 15వ వార్డుల్లో అభివృద్ధి పనులకు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత బుధవారం శంకుస్థాపన చేశారు. 15వ వార్డులో హనుమాన్ ఆలయం సమీపంలో, పోలీస్ స్టేషన్ ముందు డ్రైనేజీపై స్లాబుల నిర్మాణానికి, 13వ వార్డులో కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, వార్డుల సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.
తెలంగాణ
ఏటూరునాగారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం


