JN: జనగామ పట్టణంలోని గీతానగర్ ప్రాంతంలో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది. స్థానిక మాదారపు రాజు లక్ష్మి స్వగృహంలో పెంచుతున్న మొక్కకు బుధవారం బ్రహ్మ కమలం పూయడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులు పుష్పం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుదుగా వికసించే ఈ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
తెలంగాణ
బ్రహ్మ కమలం వికసించడంతో ఇంట్లో ఆధ్యాత్మిక సందడి


