PDPL: నూతనంగా పెన్షన్ పొందిన లబ్ధిదారుల ఖాతాలలో గురువారం నుంచి డబ్బులు జమ కానున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం మంథనిలో జరిగిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
నేటి నుంచి ఖాతాలలో డబ్బులు జమ


