హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రిస్మస్ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: జిల్లాలో సామాజిక, విద్య, సాహిత్యం, క్రీడ, కళా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి క్రిస్మస్ పండుగ సందర్భంగా సేవా పురస్కారాలు అందించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. 30 ఏళ్లు పైబడిన అర్హులైన వారు తమ సేవలకు సంబంధించిన వివరాలతో డిసెంబర్ 4వ తేదీ లోపు కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.