KMM: పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామ శివారులో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు. కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు SI షేక్ షకీర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రూ.35వేల నగదు, 4బైక్‌లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్ల ఎస్సై తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


