హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ నియామకాలు తుది దశలో

BHNG: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీ తుది అంకానికి చేరింది. 55 టీచర్ పోస్టులకు 1,102, ఎస్టీలకు కేటాయించిన 24 ఆయా పోస్టులకు 100 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 17 నుంచి 21 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ఇంటర్ మార్కులకు 70, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. ఒకట్రెండు వారాల్లో మెరిట్ జాబితా వెలువడనుంది.