హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ రెండో దశకు కొత్త ఆంక్షలు

NRML: ఇందిరమ్మ ఇళ్ల రెండో దశలో గుడిసెవాసులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధన లబ్ధిదారుల ఎంపికకు అడ్డంకిగా మారింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంపికైన 5,772 మందిలో 4,500 మందికి పైగా గుడిసెల్లో నివసించడం లేదని తేలింది. గుడిసెవాసులు 1,200 మందే ఉన్నారు. నిబంధనలు పాటించని వారిని పక్కనపెట్టాలని అధికారులు ఆదేశించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.