HNK: హన్మకొండ నగరంలోని బాలసముద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లే రహదారిపై బుధవారం పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. పలుమార్లు నీరు వృథా అవుతున్నా నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై వాహనదారులు జారిపడుతున్నారని, వెంటనే పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా


