హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లింగనిర్ధారణ చేస్తే మూడేళ్ల జైలు'

BHPL: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మధుసూదన్ ఆదేశించారు. నిన్న జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 5 ప్రభుత్వ, 8 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, నిరూపితమైతే మూడేళ్ల జైలుతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.