హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కొత్తగూడెం రానున్న ఏపీ సీఎం

BDK: రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరితో కలిసి కొత్తగూడెం రానున్నారు. ‘నవ’ లిమిటెడ్ చైర్మన్ దేవినేని అశోక్, ఎండీ త్రివిక్రమ్ ప్రసాద్ ఆహ్వానం మేరకు పాల్వంచ నవభారత్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 14 ఏళ్లకోసారి జరిగే సుదర్శన హోమంలో పాల్గొంటారు. ఇవాళ చిన్న జీయర్ స్వామి రానుండగా, కలెక్టరేట్ హెలీప్యాడ్ వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.