MHBD: పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్ఛార్జ్ డీఐజీ ఎన్. శ్వేత సూచించారు. బుధవారం తొర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు తీరును పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, కేసుల త్వరిత పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ పాల్గొన్నారు.
తెలంగాణ
తొర్రూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ


