హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూమి అక్రమ ప్లాటింగ్ తొలగింపు

BHNG: భువనగిరి పరిధి హుస్నాబాద్‌లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిలో అక్రమంగా చేపట్టిన ప్లాటింగ్‌ను రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీఓటీ చట్టం ప్రకారం భూమిని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్ తెలిపారు. ఇలాంటి భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.