హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్‌లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

NZB: నిజామాబాద్‌ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌-3లో బుధవారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 11 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై 5వ టౌన్ ఎస్‌హెచ్‌ఓ డి.సునీల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.