హైదరాబాద్: 28°C
తెలంగాణ

ద్విచక్రవాహన దొంగల అరెస్టు

HNK: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు ద్విచక్రవాహన దొంగలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వరంగల్‌కు చెందిన మహమ్మద్ గౌస్ పాషా, బాదావత్ సాయిచరణ్ దామెర మండలం గుడెప్పాడ్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ద్విచక్రవాహనాన్ని చోరీ చేశారు. వాహన తనిఖీల్లో నిందితులను పట్టుకుని, కోర్టులో హాజరుపరిచినట్లు ఆత్మకూరు సీఐ బాబులాల్ తెలిపారు.