హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాంసి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

ADB: తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. స్థానిక నాయకులు, అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని పేర్కొన్నారు.