హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పాజీపేట శివాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం

NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలోని ప్రాచీన శివాలయ పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని తొలగించే క్రమంలో స్తంభాలను జాగ్రత్తగా పక్కకు భద్రపరిచారు. గ్రామస్తులు, పెద్దలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో గర్భగుడిలోని రాళ్లు, మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా ఎలాంటి నిధులు, బావి ఆనవాళ్లు లభించలేదని గ్రామస్తులు తెలిపారు.