WGL: జిల్లా కలెక్టరేట్లో నార్కోటిక్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిఘా పెంచాలని, యువతలో అవగాహన కల్పించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నార్కోటిక్ నియంత్రణపై కలెక్టరేట్లో సమీక్ష


