హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెమీ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన బాప్టిస్ట్ చర్చి

SRPT: కోదాడ పట్టణంలోని నయానగర్ బాప్టిస్ట్ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో చర్చిని అలంకరించినట్లు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ యేసయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. క్రైస్తవులంతా వేడుకలకు హాజరుకావాలని కోరారు.