హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: మరికల్ 33/11 KV విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు AE కె. వెంకటనారాయణ తెలిపారు. మరికల్ టౌన్, తీలేరు, ఇబ్రహీంపట్నం, పసుపుల, ఎలిగండ్ల, PC కుంట రూరల్ పరిధిలో కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.