హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారు కానుక

AP: తిరుమల శ్రీవారికి ఓ NRI భక్తుడు భారీ స్వర్ణ కానుక సమర్పించనున్నారు. ఏకంగా 121 కేజీల బంగారంతో తయారు చేసిన 45 రకాల ఆభరణాలను ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అందజేయనున్నారు. స్వామివారిని శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖుచక్రాలు, వడ్డాణం, పాదుకలు, కటి వరద హస్తాలు తదితర ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇప్పటికే ఈ స్వర్ణాభరణాలు తిరుపతికి చేరుకున్నాయి.