హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు సమర్పించే భారీ బంగారు కానుకల స్వీకరణ కార్యక్రమంలో CM పాల్గొంటారు. చంద్రబాబు సమక్షంలో సదరు భక్తుడు స్వామివారి కోసం దాదాపు 121 కిలోల బంగారు ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి సమర్పించనున్నాడు. ఇందులో శ్రీవారి దివ్య కిరీటం, పద్మపాదాల ఆభరణాలున్నాయి. అనంతరం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం వెళ్తారు.