AP: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన తల్లులకు జన్మించిన ఇద్దరు శిశువులు, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. ఒక్కసారిగా చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలు మరణించారని ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
విషాదం.. ఇద్దరు నవజాత శిశువుల మరణం


