AP: నిత్యావసరాల బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. టోల్గేట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలన్నారు. ఏడాదిన్నర పాటు మార్కెట్ ధరలు, ద్రవ్యోల్బణాన్ని పర్యవేక్షించాలని సూచించారు. కంది సాగు రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని, కూరగాయల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయండి: సీఎం


