AP: అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అటవీశాఖ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ అభినందించారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి.. వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించి తొలగించారు. వీరిని అభినందించిన పవన్ అటవీ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయాలని ఆదేశించారు.
వార్తలు
మారేడుమిల్లి ఫారెస్టులో 69 వేట ఉచ్చులు తొలగింపు


