హైదరాబాద్: 28°C
వార్తలు

చికెన్ షవర్మా తిని 43 మందికి అస్వస్థత

మహారాష్ట్రలోని భివండీ వంజార్ పట్టి నాకా వద్ద చికెన్ షవర్మా తిని 43 మంది ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. బాధితుల్లో 17 మంది పురుషులు, 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులతో పాటు ఓ గర్భిణీ ఉన్నారు. వీరంతా ఇందిరాగాంధీ స్మృతి ఉపజిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు కారణమైన దుకాణాన్ని అధికారులు కూల్చివేశారు. దీంతో ఆహార భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.