హైదరాబాద్: 28°C
వార్తలు

​గురుకుల ఘటనపై మాజీ మంత్రి ఆగ్రహం

ఉమ్మడి జిల్లా: మహబూబాబాద్‌ గిరిజన గురుకుల కళాశాల విద్యార్థిని ప్రసవం, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సిన నర్సింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యులైన ప్రిన్సిపల్, ఆర్సీఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.