HYD: బంజారాహిల్స్ ట్రాఫిక్ మహిళా ASI దేవేంద్ర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యాక్టివాపై రోడ్ నంబర్ 7 వైపు వెళ్తుండగా GVK మాల్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చేయి, కాలికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
GVK మాల్ వద్ద ASIని ఢీకొట్టిన కారు


