హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

SRD: జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్ లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ.2,00,120 నగదు, 52 పేకాట కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SP పరితోష్ పంకజ్ హెచ్చరించారు.